NEWSANDHRA PRADESH

ఏపీలో ఇక జ‌న రాజ్యం

Share it with your family & friends

రాక్ష‌స రాజ్యానికి మంగ‌ళం
గుంటూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గుంటూరు జిల్లా చీరాల‌లో జ‌రిగిన ప్ర‌జా గ‌ళం బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ప్ర‌ధానంగా ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న కొన‌సాగడం లేద‌న్నారు. రాచ‌రిక పాల‌న కొన‌సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు చంద్ర‌బాబు నాయుడు.

రాక్ష‌స రాజ్యానికి మంగ‌ళం పాడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జ‌న రాజ్యం త్వ‌ర‌లోనే రాబోతోంద‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. జ‌గ‌న్ త‌నంత‌కు తానుగా ఓ నియంత‌న‌ని భావిస్తున్నాడ‌ని ఆరోపించారు.

ఆయ‌న పనై పోయింద‌ని, ఇక ఇంటికి వెళ్ల‌డ‌మే మిగిలి ఉంద‌ని జోష్యం చెప్పారు నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తూ ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కుగ ఉరి చేస్తున్న జ‌గ‌న్ రెడ్డికి త‌గిన రీతిలో ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించిన ఏ నాయ‌కుడు బ‌తికి బ‌ట్ట క‌ట్టిన దాఖ‌లాలు చ‌రిత్ర‌లో లేవ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. త‌మ‌కు 170కి పైగా సీట్లు రాక త‌ప్ప‌ద‌న్నారు.