ఏపీలో ఐదుగురు రెడ్లదే హవా
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐదేళ్ల జగన్ రెడ్డ పాలనలో ఆ ఐదుగురు రెడ్లదే హవా కొనసాగిందని, వారిదే పెత్తనం నడిచిందని ఆరోపించారు. వారెవరో కాదు సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు విజయ సాయి రెడ్డి, పెద్ది రెడ్డి, వైవీ సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు.
వీళ్లు తప్ప ఇంకొకరు ఎవరైనా బాగు పడ్డారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ ఐదుగురి వ్యవహారాలు, అరాచకాలు, సంపాదించిన ఆస్తులపై , దోపిడీపై తప్పకుండా విచారణ జరిపిస్తామని ప్రకటించారు. జగన్ పనై పోయిందన్నారు. ఆయన ఇక ఇంటికి వెళ్లడం మిగిలి ఉందన్నారు.
టీడీపీ కూటమి కనీసం 170కి పైగా సీట్లు వస్తాయని, ఇక లోక్ సభ ఎన్నికల్లో 20కి పైగా రానున్నాయని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇకనైనా జగన్ రెడ్డి అబద్దాలు చెప్పడం మానుకోవాలన్నారు. తన చిన్నాన్నను చంపింది ఎవరో సీఎంకు తెలియదా అని ప్రశ్నించారు.
ఎవరైనా స్వంత బాబాయిని చంపిస్తారా అని నిలదీశారు. విచిత్రం ఏమిటంటే తను సేఫ్ గా ఉండడం కోసం తండ్రి పేరును ఛార్జి షీట్ లో నమోదు చేయించడం దారుణమన్నారు చంద్రబాబు నాయుడు. ఇది తను చెప్పడం లేదని స్వంత చెల్లెలు ఆరోపిస్తున్నదని తెలిపారు.