తిరుమల కొండ పై రాజకీయాలు వద్దు – సీఎం
స్పష్టం చేసిన నారా చంద్రబాబు నాయుడు
తిరుమల – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటం సబబు కాదని పేర్కొన్నారు. కొండపై కేవలం గోవింద నామ స్మరణ మాత్రమే వినిపించాలని స్పష్టం చేశారు.
ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకు రావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డిని ఆదేశించారు సీఎం. లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారని….ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి…మరింత మెరుగు పడాలన్నారు.
ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని..అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలన్నారు . తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలన్నారు…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించ కూడదన్నారు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలన్నారు..ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు అని సూచించారు నారా చంద్రబాబు నాయుడు.
టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే వారిని గౌరవించు కోవాలన్నారు. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండ కూడదన్నారు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలన్నారు. తిరుమల పేరు తలిస్తే….ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలన్నారు.