ఎవరైనా తల్లి..చెల్లెలిపై కేసు వేస్తారా..?
జగన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు సెటైర్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గురువారం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున సమస్యలను ప్రస్తావించాలి. లేదంటే ఉపయోగకరమైన రాస్ట్రానికి సంబంధించి విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాలి తప్పితే ఇలా స్వంత కుటుంబానికి చెందిన వ్యక్తులనే జగన్ రెడ్డి టార్గెట్ చేయడం దారుణమన్నారు.
ఇది పూర్తిగా వ్యక్తిగతం అయినప్పటికీ లేనిపోని ఆరోపణలు చేస్తూ , తమపై విమర్శల బాణాలు సంధిస్తున్న జగన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తోందని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి వాడినా ఏపీ ప్రజలు సీఎంగా ఎలా ఎన్నుకున్నారంటూ ప్రశ్నించారు. అందుకే దిమ్మ తిరిగిలా 11 సీట్లకు పరిమితం చేసినా మనోడి ప్రవర్తనలో, వ్యవహారంలో మార్పు రాలేదని మండిపడ్డారు నారా ఏపీ సీఎం.
జగన్ మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్తులన్నీ ప్రజలకు చెందినవేనని అన్నారు. తన మీద, అవినాష్ రెడ్డి మీద రాజకీయంగా కామెంట్స్ చేయకుండా ఉంటేనే ఆస్తులలో వాటా ఇస్తానంటావా ఇదేనా నీ రాజకీయం అంటూ మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నాడంటూ ఎద్దేవా చేశారు నారా చంద్రబాబు నాయుడు.