సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ పై భగ్గుమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించారు. పోలీసులు చెప్పినా పట్టించు కోలేదని గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారని మండిపడ్డారు.
సీఎంగా పని చేసిన వ్యక్తికి కోడ్ ఉందనే విషయం తెలియక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈసీ రూల్స్ పాటించకుండా మరో వైపు భద్రత కల్పించాలని కోరడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై స్పందించేందుకు వివిధ వేదికలు ఉన్నాయని అన్నారు.
గురువారం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఎన్డీయే కీలక సమావేశంలో పాల్గొన్నారు. మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు. అనంతరం ఢిల్లీ నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర సీఎంలు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు.