సైకోలకే సైకో జగన్ మోహన్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్స్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర శాసన సభలో ప్రసంగించిన చంద్రబాబు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఆయన చేసిన నిర్వాకం కారణంగానే ఏపీ అప్పుల కుప్పగా మారిందని ధ్వజమెత్తారు.
ఇలాంటి వ్యక్తిని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవిత ప్రస్థానంలో సైకోలను ఎందరినో చూశానని జగన్ రెడ్డి లాంటి డిఫరెంట్ సైకోను చూడలేదని, అందుకే ప్రజలు ఛీ కొట్టారని అయినా బుద్ది రాలేదంటూ ఎద్దేవా చేశారు నారా చంద్రబాబు నాయుడు.
జగన్ రెడ్డిని తాను సైకో అని ఊరికే అన లేదని అన్నారు. అసెంబ్లీలో 80 శాతం మంది ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించాడని ఆరోపించారు సీఎం. ఇవాళ సభలోని జగన్ అక్రమ కేసుల బాధితులలో తాను ఒకడినంటూ గుర్తు చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తనపై 20కి పైగా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశాడని, చివరకు జైలుపాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకున్నాడని, ప్రశ్నించే వాళ్లు ఉండ కూడదని వేల సంఖ్యలో కేసులు నమోదు చేయించాడని ధ్వజమెత్తారు.