అప్పుల కుప్పగా మారిన ఏపీ
జగన్ పై చంద్రబాబు ఫైర్
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో లూటీ చేశాడని, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో భారీ ఎత్తున ఖాళీలు ఉన్నప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. అన్ని వర్గాల వారిని మోసం చేశాడని, ప్రజల చెవుల్లో సంక్షేమం పేరుతో పూలు పెట్టాడని ఎద్దేవా చేశారు నారా చంద్రబాబు నాయుడు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని, ఇక ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, జగన్ రెడ్డిని ఓడించడం ఖాయమన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా, చివరకు మిగిలేది అపజయం మాత్రమేనని పేర్కొన్నారు. ఇప్పటి వరకు చెబుతూ వచ్చినవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు నారా చంద్రబాబు నాయుడు.
జగన్ పాలనను భరించలేక ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రజలకు తాము వచ్చాక స్వేచ్ఛను ప్రసాదిస్తామన్నారు. నిరంకుశ, రాక్షస, రాజా రెడ్డి పాలన సాగిస్తున్న జగన్ రెడ్డికి జనం తగిన రీతిలో గుణపాఠం చెప్పక తప్పదన్నారు టీడీపీ చీఫ్.