జగన్ ఫోటో ఎందుకు – బాబు
అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సీఎం
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. శనివారం పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జరిగిన ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.
ప్రజలకు చెందిన భూములకు సంబంధించి జారీ చేసిన పాసు పుస్తకాలపై పనిగట్టుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు చెందిన ఆస్తులపై వారి ఫోటోలు ఉండాలని జగన్ రెడ్డి పిక్చర్ ఎందుకని నిలదీశారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రధానంగా ల్యాండ్ టైటలింగ్ చట్టం వస్తే ఇల్లు, స్థలం, భూమి మీద మీ పెత్తనం ఉండ కూడదన్నారు. ఎక్కడ చూసినా జగన్ పెత్తనమే కొనసాగుతోందని ఆరోపించారు. ఏంటీ సైకో గోల ఎందుకు కోట్లాది ప్రజలకు అవసరమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.