జగన్ పరిశ్రమల సంగతి ఏంటి
నిలదీసిన చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్ల పాలనా కాలంలో ఎన్ని పరిశ్రమలను తీసుకు వచ్చారో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాప్తాడు ప్రజలు అడుగుతున్నారని, జాకీ పరిశ్రమను ఎందుకు తరిమి వేశావని పేర్కొన్నారు.
అనంత పురం జిల్లా అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఎక్కడికి పోయాయని, సీమ రైతులు అడుగుతున్నారు నాటి డ్రిప్ పథకాల సంగతి ఏమిటని . సమాధానం చెబుతావా లేక సభ సాక్షిగా తేల్చుకుందామా అని సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు.
నవ రత్నాలు పేరుతో ఏపీ ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశారంటూ మండిపడ్డారు. అందుకే ప్రజలు చీ కొట్టేందుకు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి త్వరలో జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్.
వై నాట్ 175 సీట్లు మాటేమిటో కానీ కనీస సీట్లు వస్తే కష్టమన్నారు . ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు.