NEWSANDHRA PRADESH

జగన్‌ నోట అబద్ధాల వరద

Share it with your family & friends

నారా చంద్ర‌బాబు నాయుడు

గుంటూరు – ఏపీ సీఎంపై నిప్పులు చెరిగారు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు. కుప్పంలో నీళ్లంటూ జ‌గ‌న్ నోట అబ‌ద్దాల వ‌ర‌ద పారిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. గుంటూరులో జ‌రిగిన శంఖా రావం స‌భ‌లో ప్ర‌సంగించారు చంద్ర‌బాబు నాయుడు.

పులివెందులలో ఎండిపోతున్న పైర్లకు నీళ్లివ్వలేని సీఎం కుప్పానికి మేలు చేస్తాడా అని నిల‌దీశారు. 13 శాతం కాలువ పనులకు 5 ఏళ్లు తీసుకున్నాడంటూ ఎద్ద‌వా చేశారు. దేశంలో మోడల్ నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ వచ్చాక హింసా రాజకీయాలు చోటు చేసుకున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ప్రాజెక్టుల గేట్లకు గ్రీజు రాయలేని ప్రభుత్వం..సాగునీటి ప్రాజెక్టులు కడుతుందా అని నిల‌దీశారు. బాబాయి హత్యపై 5 ఏళ్లుగా సమాధానం చెప్పని జగన్ హత్యా రాజకీయాలని మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

కుప్పంలో అభివృద్ధి ముద్ర తెలుగుదేశానిది అయితే వైసీపీది రక్తపు మరక అని టీడీపీ అధినేత అన్నారు.
రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ 5 ఏళ్ల పాలనలో రూ.12,500 కోట్లు ఖర్చు చేశామ‌న్నారు. కానీ జ‌గ‌న్ వ‌చ్చాక కేవ‌లం రూ. 2 వేల కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశాడ‌ని ఆరోపించారు చంద్ర‌బాబు నాయుడు.