సీఎం రాయలసీమకు ద్రోహం
నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నాడని ప్రశ్నించారు. తన హయాంలో ఏపీని అన్ని రంగాలలో ముందంజలో తీసుకు వెళ్లానని, కానీ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆవేదన చెందారు నారా చంద్రబాబు నాయుడు.
రాయలసీమకు అన్ని విధాలుగా ద్రోహం తలపెట్టిన ఘనత సీఎందేనని మండిపడ్డారు. ఏకంగా 102 ప్రాజెక్టులను పక్కన పెట్టాడని, కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడని, చివరకు నీళ్లు లేకుండా చేశాడని ధ్వజమెత్తారు. ఒక విజన్ లేని సీఎం ఉండడం వల్ల రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు చంద్రబాబు నాయుడు.
పంటలను ఎండ బెట్టాడు, తాగునీటికి కటకట లాడే స్థితికి తీసుకు వచ్చేలా చేశాడన్నారు. ఐదేళ్ల పాటు ప్రజల మొహం చూడేందుకు కూడా ఇష్ట పడలేదన్నారు. ఇక మళ్లీ ఎలా గెలుస్తాడని అనుకున్నారంటూ నిలదీశారు.