వివేకాను చంపింది ఎవరో చెప్పు
జగన్ ను నిలదీసిన చంద్రబాబు
అమరావతి – వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరో చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డిని నిలదీశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయ అవసరాల కోసం , కేవలం పవర్ కోసం తన చిన్నాన్నను చంపించాడన్న ఆరోపణలు జగన్ రెడ్డిపై ఉన్నాయని అన్నారు. ఈ దేశంలో న్యాయం అన్నది ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రేపు నిన్ను చంపితే పరిస్థితి ఏంటి అని సీరియస్ కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు.
తాము ప్రజలు ఏమని అనుకుంటున్నారో వారి మాటలనే చెబుతన్నామని, మరి ప్రభుత్వ సలహాదారు, అన్నీ తానై వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటూ సెటైర్ వేశారు టీడీపీ చీఫ్. బాబాయ్ ని వేసిన వాడు ఉలిక్కి పడాలి కదా అన్నారు. ఆ వేసేసిన వాడిని చూసి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు.