నేనొస్తా జగన్ కు షాకిస్తా
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నానని అన్నారు. టీడీపీ కూటమి విజయ ఢంకా మోగించ బోతోందని, ఇక జనం మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రజా గళం పేరుతో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన సభలో ప్రసంగించారు.
ఏపీని నమ్మి అప్పగిస్తే సర్వ నాశనం చేశాడంటూ జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ఇప్పటికే అప్పుల కుప్పగా మార్చేశాడని ధ్వజమెత్తారు. జనం జగన్ ను నమ్మే స్థితిలో లేరన్నారు చంద్రబాబు నాయుడు. ప్రజలు స్వచ్చందంగా జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని జోష్యం చెప్పారు.
పని చేసే వాళ్లకు పట్టం కడతారని, తాము ఓటు వేసినందుకు ప్రస్తుతం పశ్చాత పడుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి నవ రత్నాల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. ఈసారి తాను వచ్చాక జగన్ కు చుక్కలు చూపిస్తానంటూ హెచ్చరించారు నారా చంద్రబాబు నాయుడు.