NEWSANDHRA PRADESH

బ‌ట‌న్ నొక్క‌డం పెద్ద‌ప‌ని కాదు

Share it with your family & friends

చంద్ర‌బాబు నాయుడు కామెంట్

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీప్ నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జాగ‌ళం స‌భలో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. జ‌గ‌న్ ప‌దే ప‌దే బ‌ట‌న్ నొక్కుతానని అంటున్నాడ‌ని, రాష్ట్రంలో ఎవ‌రైనా బ‌ట‌న్ నొక్కుతార‌ని అదేమంత పెద్ద ప‌ని కాదంటూ ఎద్దేవా చేశారు.

మంచం మీద ప‌డుకున్న ముస‌ల‌మ్మ కూడా బ‌ట‌న్ నొక్కుతుంద‌న్నారు. ఎవ‌రైనా సీఎం ముందుగా వ‌న‌రుల‌ను గుర్తించాలి, వాటిని ఎలా ఉప‌యోగించు కోవాల‌నే దానిపై దృష్టి సారించాల‌న్నారు. కానీ సంక్షేమ ప‌థ‌కాల పేరుతో జ‌నాన్ని బురిడీ కొట్టించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

సంప‌ద సృష్టించ‌డంపై ఇప్ప‌టి వ‌ర‌కు ఫోక‌స్ పెట్టిన పాపాన జ‌గ‌న్ పెట్ట‌లేదంటూ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసి దోపిడీకి ద్వారాలు తెరిచాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు . ప్ర‌జ‌లు జ‌గ‌న్ ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. జ‌గ‌న్ రెడ్డిని ఇంటికి పంపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.