ఐదేళ్ల వైసీపీ పాలన ఓ పీడకల
ఎక్కడ చూసినా అవినీతేనన్న సీఎం
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఆయన ముఖ్యమంత్రిగా కొలువు తీరాక కుప్పంకు తొలిసారిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయనకు భారీ ఆదరణ లభించింది. ఐదేళ్ల వైసీపీ పాలన ఓ పీడకల అని ఆరోపించారు. అంతులేని అవినీతి అక్రమాలకు అడ్డాగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారంటూ ధ్వజమెత్తారు.
వైసీపీ పాలనలో దెబ్బతిన్న రంగాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రైతుల పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేసి ఇస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు. తాను జీవితంలో మరిచి పోలేను కుప్పం గురించి అంటూ కితాబు ఇచ్చారు.
తన రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టేలా చేసిన ఈ నియోజకవర్గం గురించి, ఇక్కడి ప్రజల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు ఏపీ సీఎం. తాను 9 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందానని ఇందులో ఎనిమిదిసార్లు గెలుపొందానని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.