జగన్ లేఖలో అన్నీ అబద్దాలే – చంద్రబాబు
నిప్పులు చెరిగిన ఏపీ ముఖ్యమంత్రి
అమరావతి – తిరుపతి లడ్డూ కల్తీ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి రాసిన లేఖపై తీవ్రంగా స్పందించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
పీఎంకు రాసిన లేఖలో జగన్ రెడ్డి అన్నీ అబద్దాలే చెప్పాడని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దేవాలయాలను సర్వ నాశనం చేశాడని ఆరోపించారు. అన్యమతాలకు చెందిన వారిని కీలక పదవుల్లో నియమించాడని మండిపడ్డారు.
అబద్దాలు చెప్పడం, ఫేక్ ప్రచారం చేయడం జగన్ మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఫైర్ అయ్యారు నారా చంద్రబాబు నాయుడు. విచిత్రం ఏమిటంటే ఏ ఒక్కటి వాస్తవం లేదన్నారు పీఎంకు రాసిన లేఖలో.
జంతు కొవ్వు కల్తీని గుర్తించే ల్యాబ్ తిరుమలలో ఉందని పేర్కొనడం పూర్తిగా అబద్దమని కొట్టి పారేశారు సీఎం. జంతు కొవ్వు కల్తీ గుర్తించే టెస్టింగ్ ల్యాబ్ లేదని స్పష్టం చేశారు.
కేవలం తేమ శాతం లాంటివి గుర్తించే ప్రాథమిక పరీక్షలు మాత్రమే చేసే ల్యాబ్ ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. జంతు కొవ్వు కల్తీ తేల్చాలి అంటే ఎన్‌ఏబీఎల్ ధ్రువీకరణ ఉన్న ల్యాబ్‌కే వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఒక్కసారిగా కూడా జగన్ ప్రభుత్వ హయాంలో అక్కడ టెస్ట్ చేయించ లేదని ఆరోపించారు.