నేనుంటే ఎయిర్‌పోర్ట్ పూర్తయ్యేది
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సర్కార్ పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలన పడకేసిందని, జగన్ నాలుగున్నర ఏళ్ల పాటు నిద్ర పోయాడంటూ ఫైర్ అయ్యారు.
ప్రభుత్వం మారకుండా ఉండి ఉంటే ఇప్పటికే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ 2020 నాటికే పూర్తయి ఉండేదన్నారు. ఆనాడు తమ సర్కారే విమానాశ్రయం కోసం స్థల సేకరణ, శంకుస్థాపన కూడా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
తీరా ప్రభుత్వం మారిందని, జగన్ మోహన్ రెడ్డి వచ్చాక ఆ పని పూర్తి కాలేదన్నారు. ఒకవేళ ఆ ఎయిర్ పోర్టు పూర్తయి ఉండి ఉంటే ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు నారా చంద్రబాబు నాయుడు. అభివృద్ది గురించి విజన్ లేనటువంటి నాయకుడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు.