హత్యలు చేసిన చరిత్ర నీదా నాదా
జగన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఫైర్
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు. జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఒకవేళ ఓడి పోతే తాను చేసిన నేరాలు, ఘోరాలు బయటకు వస్తాయని వణుకుతున్నాడని ఎద్దేవా చేశారు.
తప్పుడు వీడియోలతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన ఘనత నీది కాదా అని ప్రశ్నించారు. నువ్వు , నీ భార్య నడిపే సాక్షి పత్రిక, మీడియాను అడ్డం పెట్టుకుని లెక్కలేనన్ని డ్రామాలు ఆడుతున్నావంటూ ఎద్దేవా చేశారు. అయినా జనం నిన్ను నమ్మే రోజు పోయిందన్నారు. వాళ్లంతా గంప గుత్తగా నిన్ను ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
గొడ్డలి వేటుతో బాబాయిని చంపిన వాడికి ఇతరులను లేపేయడం ఓ లెక్కా అని మండిపడ్డారు. చిల్లర రాజకీయాలు, నేర పూరితమైన కుట్రలు, కుతంత్రాలు నీకు మాత్రమే చెల్లిందని తనకు కాదన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడూ తాను అవినీతికి పాల్పడిన దాఖలాలు లేవన్నారు. తనది నిఖార్సైన జీవితం అని పేర్కొన్నారు. ఇక ఇంటికి వెళ్లేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు.