NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ భూ దోపిడీ చ‌ట్టం

Share it with your family & friends

చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో భూ, ఇసుక మాఫియా కొన‌సాగుతోంద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

జ‌గ‌న్ రెడ్డి జ‌నాన్ని దోచుకోవ‌డమే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో విలువైన భూముల‌ను కొల్ల‌గొట్టేందుకు ప్లాన్ చేశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇందు కోసం కొత్త‌గా చ‌ట్టాన్ని తీసుకు వ‌చ్చాడ‌ని ఫైర్ అయ్యారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఆ చ‌ట్టం పేరు ఏమిటంటే జ‌గ‌న్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ప్ర‌క‌టించారు. మీకు సంబంధించిన ఆస్తులు మీ పేరు మీద ఉండ‌వ‌న్నారు. కేవ‌లం త‌న పేరు మాత్ర‌మే ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఇక‌నైనా ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని, జ‌గ‌న్ రెడ్డికి ఓటు వేస్తే మీ స‌ర్వ‌స్వం మీరు కోల్పోయిన‌ట్టేన‌ని పేర్కొన్నారు.

ఏద‌న్నా అవ‌స‌రం వ‌చ్చి మీరు ఆస్తులు అమ్ము కోవాలని అనుకుంటే మీకు హ‌క్కులంటూ ఉండ‌వ‌ని, స‌ర్వ హ‌క్కులన్నీ జ‌గ‌న్ రెడ్డి చేతిలో ఉంటాయ‌ని హెచ్చ‌రించారు.