రాష్ట్రానికి తీరని అవమానం
సచివాలయం తాకట్టుపై బాబు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయాలన్ని తాకట్టు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్పందించారు. రాష్ట్రానికి ఇది తీరని అవమానమని పేర్కొన్నారు. ఇది తనను బాధకు గురి చేసిందని వాపోయారు నారా చంద్రబాబు నాయుడు.
ఎంత సిగ్గు చేటు అంటూ జగన్ రెడ్డిని ఏకి పారేశారు. సిగ్గు, శరం లేకుండా ఎలా సచివాలయాన్ని తాకట్టు పెడతారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండె కాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకు రావడం దారుణమన్నారు.
దేశ చరిత్రలో ఇలాంటిది ఎక్కడా లేదన్నారు. ఇది కేవలం జగన్ రెడ్డి వల్లనే జరిగిందని మండిపడ్డారు.
రూ. 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని, తాకట్టు పెట్టడం అంటే ఏంటో ఈ ముఖ్యమంత్రికి తెలుసా అని నిలదీశారు.
నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు….తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్‌ని అని మండిపడ్డారు. ప్రజలారా…అసమర్థ, అహంకార, విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి అని పిలుపునిచ్చారు.