వివేకా మర్డర్ పై జగన్ అబద్దాలు
నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి – టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. దివంగత ఎంపీ, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. శుక్రవారం ప్రజాగళం సందర్బంగా జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే నేరాల సంఖ్య పెరిగిందన్నారు. హత్యలు, దారుణాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తన స్వంత బాబాయ్ ని చంపితే తానే సీఎంగా ఉండి ఇప్పటి వరకు నిందితులను ఎందుకు పట్టు కోలేదంటూ ప్రశ్నించారు నారా చంద్రబాబు నాయుడు. ఇంకా ఎవరిని వంచించేందుకు నటిస్తున్నావంటూ ఎద్దేవా చేశారు.
ప్రజలంటే ఏమని అనుకుంటున్నావంటూ మండిపడ్డారు . ఇంత పచ్చిగా అబద్దాలు ఆడటం జగన్ కే చెల్లిందన్నారు. ప్రజలను, వ్యవస్థలను, చివరకు చెల్లెళ్లను కూడా అవమానించినట్లు కాదా అని నిలదీశారు నారా చంద్రబాబు నాయుడు. ప్రజలు రాక్షస పాలనను కోరుకోవడం లేదన్నారు. తాము వచ్చాక ప్రజా పాలన సాగిస్తామన్నారు టీడీపీ చీఫ్.