జగన్ చాప్టర్ క్లోజ్ – బాబు
చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డికి అంత సీన్ లేదన్నారు. ఆయన పనై పోయిందని అన్నారు.
తండ్రి చని పోగానే సీఎం పదవి కోసం రాజకీయం చేశాడు. తల్లిని గెంటేశాడు. చెల్లిని అవమానించాడు. స్వంత చిన్నాన్నను దారుణంగా హత్య చేయించాడు. చివరకు ఏపీని అప్పుల కుప్పగా మార్చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ చీఫ్.
నెత్తి మీద రూపాయి పెట్టి వేలం వేస్తే పైసాకు కూడా అమ్ముడు పోడంటూ ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు. జగన్ రెడ్డి సైకో రెడ్డి అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.
గులక , కోడి కత్తి, గొడ్డలి డ్రామాలు ఇక చెల్లవని సీఎం తెలుసు కోవాలన్నారు చంద్రబాబు నాయుడు. జగన్ ను బొంద పెట్టేందుకు జనం రెడీగా ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు.