జగన్ ద్రోహం పోలవరం విధ్వంసం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. తను అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుకు తీరని ద్రోహం చేశాడని ఆరోపించారు. ఎలా విధ్వంసానికి గురైందనే విషయాన్ని పూర్తి వివరాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఏపీ సీఎం.
జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బతిందన్నారు. అసమర్థత, అహంకారం, దుస్సాహసం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడిందని మండిపడ్డారు. ఏజెన్సీలను మార్చొద్దని పీపీఏ చేసిన హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు. వాస్తవాలు దాచి పెట్టి పోలవరం పూర్తి చేస్తాం అంటూ తప్పుడు ప్రకటనలు చేశారని భగ్గుమన్నారు.
టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తైతే…వైసీపీ ప్రభుత్వం చేసింది కేవలం 3.84 శాతం మాత్రమేనని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీట్లర్లే అంటూ కొత్త ప్రతిపాదనలు తెచ్చారని, ప్రాజెక్టును చూస్తే తనకు బాధ కలుగుతోందన్నారు.