12న బాబు ప్రమాణ స్వీకారం
11న టీడీఎల్పీ సమావేశం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొలువు తీరనున్నారు. తాజాగా రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఫలితాలు వెల్లడి అయ్యాయి.
ఈ ఫలితాలలో తెలుగుదేశం పార్టీకి 135 స్థానాలు దక్కగా జనసేన పార్టీకి 21 స్థానాలు , వైసీపీకి 11 సీట్లు దక్కాయి. ఇక భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు లభించాయి. ఇదిలా ఉండగా సీఎంగా తమ నాయకుడిని ఎన్నుకోనున్నారు .
ఈ మేరకు తేదీ ఖరారు కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. ఈనెల 11న తెలుగుదేశం పార్టీ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా నూతన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు నారా చంద్రబాబు నాయుడు. తాను కోరుకున్న, ఏర్పాటు చేయాలని అనుకున్న రాజధాని అమరావతి వేదికగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.