కుప్పం రుణం తీర్చుకుంటా
ప్రజా పాలనకు శ్రీకారం చుట్టాం
అమరావతి – ఏమిచ్చి రుణం తీర్చు కోగలనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రిగా గెలుపొందిన అనంతరం తొలిసారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్వస్థలం కుప్పంకు విచ్చేశారు. ఈ సందర్బంగా దారి పొడవునా జనం బ్రహ్మ రథం పట్టారు. అడుగడుగునా నీరాజానాలు పలికారు.
ఈ సందర్బంగా భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చు కోగలనంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తనను గెలిపిస్తూ వస్తున్న మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు.
కూటమి ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తామని అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేసి..అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. కొత్త సర్కార్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని అయినా రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తామని చెప్పారు.