NEWSANDHRA PRADESH

గురు క‌న‌క దాస మార్గం అనుస‌ర‌ణీయం

Share it with your family & friends

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – శ్రీ‌శ్రీ‌శ్రీ గురు కన‌క‌దాస చూపిన మార్గం గొప్ప‌ద‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. కురుబ గౌడ దాస కుటుంబంలో జన్మించి శ్రీకృష్ణ భ‌గ‌వానుడికి గొప్ప భక్తుడిగా, ఆధునిక కవిగా, సంగీతకారుడిగా, స్వరకర్తగా శ్రీ భ‌క్త క‌న‌క‌దాస గుర్తింపు పొందార‌ని అన్నారు. సోమ‌వారం క‌నక దాస‌ జ‌యంతి సంద‌ర్బంగా నివాళులు అర్పించారు.

భక్తి మార్గంలో ఆయన చేసిన బోధనలు నేటికీ అనుసరణీయం అన్నారు సీఎం. ప్రజలకు అర్థమయ్యే రీతిలో సరళమైన భాషలో ఆయన ఎన్నో ఏళ్ల కిందట చేసిన బోధనలు ఈనాటి సమాజానికి కూడా మార్గదర్శనం చేస్తున్నాయంటే ఆ మహనీయుడి దార్శనికతను మనం అర్ధం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు .

శ్రీశ్రీశ్రీ గురు కనకదాస బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాన‌ని తెలిపారు. అందుకే కనకదాస జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని స్ప‌ష్టం చేశారు.

ప్రజలలో భక్తి , సామాజిక బాధ్యత , సమత్వం పెంపొందిస్తూ శ్రీ‌శ్రీ‌శ్రీ గురు క‌న‌క‌దాస ఎన్నో కీర్త‌న‌లు పాడార‌ని, ఆయ‌న ఆచ‌రించిన మార్గం స‌దా స్మ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.

కర్ణాటకలో జన్మించిన శ్రీశ్రీశ్రీ గురు కనకదాస రాయలసీమలోనూ కుల వ్యవస్థ, అసమానతలపై చైతన్యం తీసుకొచ్చిన సామాజిక తత్వవేత్త అని పేర్కొన్నారు. బీసీలను, వారి సాంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, వారి ఉన్నతి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాల్సిన అవసరం ఉంద‌ని గుర్తు చేసిన మహనీయుడని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.