వీరేశలింగం స్పూర్తి దాయకం
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్బంగా గుర్తు చేశారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఆయన చేసిన సేవలు సమాజానికి ఎంతో మేలు చేకూర్చాయని పేర్కొన్నారు. ఆయన తన జీవిత కాలమంతా సంఘం కోసం పాటు పడ్డారని కొనియాడారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని ప్రశంసలు కురిపించారు.
వీరేశ లింగం పంతులు చివరి చూపు వరకు తాను కట్టుబడిన విలువల కోసం బతికారని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో బలంగా ఉన్న అవినీతిని ఆనాడే ఎత్తి చూపిన మహనీయుడని ప్రశంసించారు నారా చంద్రబాబు నాయుడు. మహిళల అభ్యున్నతికి బాటలు వేయడంలో తెలుగుదేశం పార్టీకి ఆయనే స్పూర్తిగా నిలిచారని చెప్పారు.
ఈ స్పూర్తిని కాపాడు కునేందుకు, మనందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం.