చికిత్స కోసం యుఎస్ కు బాబు
ఆయనతో పాటు సతీమణి కూడా
అమరావతి – వైద్య పరీక్షల కోసం తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమెరికాకు వెళ్లారు. ఆయనతో పాటు భార్య భువనేశ్వరి కూడా ఉన్నారు. నిన్న రాత్రి బయలు దేరిన బాబు, సతీమణి యుఎస్ లో ల్యాండ్ అయ్యారు.
ఇదిలా ఉండగా వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్లారు. ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేశ్ కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలసి అమెరికా వెళ్లారు.
50 రోజులుగా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు. సభలు, రోడ్ షోలు, ర్యాలీలలో పాల్గొన్నారు. జనాన్ని ఉత్సాహ పరిచేలా చేశారు. కూటమిని ఏర్పాటు చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో తమ కూటమి పవర్ లోకి వస్తుందని ఆయన నమ్మకంతో ఉన్నారు.