చంద్రబాబు నాయుడు వైరల్
ఏపీలో కూటమి గెలుపులో పాత్ర
అమరావతి – ఏపీలో ఫలితాలు ఆశించిన దానికంటే షాకింగ్ కు గురి చేశారు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేశారు సీఎం. వేల కోట్లు ప్రజలకు చేరువయ్యేలా చేశారు. కానీ జనం ఆయనను నమ్మలేదు. చంద్రబాబు నాయుడు కూటమికి పెద్ద ఎత్తున పట్టం కట్టారు.
సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు వైరల్ గా మారారు. ఆయన మరోసారి ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. జగన్ హయాంలో చోటు చేసుకున్న కక్ష సాధింపు చర్యలు దెబ్బ కొట్టాయి. మితి మీరిన అహంకారం , ఆధిపత్య ధోరణి, దౌర్జన్యం ,పన్నుల భారం వెరసి తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామి పట్ల సర్కార్ అనుసరించిన నిర్లక్ష్య ధోరణి కొంప ముంచేలా చేసిందని టాక్.
ఇదిలా ఉండగా అత్యధిక సీట్లను కైవసం చేసుకునే దిశగా టీడీపీ కూటమి పయనించడం విశేషం. వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళ్లిన జగన్ రెడ్డిని బండ కేసి కొట్టారు ఏపీ ప్రజలు. ఒక రకంగా టీడీపీ కూటమి చరిత్ర సృష్టించింది.