మహా కుంభాభిషేకంలో బాబు
అమ్మ వారి దర్శనం మహత్భాగ్యం
కుప్పం – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇదిలా ఉండగా కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మ వారి దేవాలయం.
స్థానికులు చంద్రబాబు నాయుడితో కలిసేందుకు పోటీ పడ్డారు. వారితో ముచ్చటించారు. వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా అమ్మ వారి దేవాలయానికి చేరుకున్నారు. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడుకు.
శత రత్న జీర్ణోద్దారణ ప్రతిష్ట మహా కుంభాభిషేకంలో పాల్గొన్నారు . పూజలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని , ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కన్యకా పరమేశ్వరి అమ్మ వారిని కోరుకున్నట్లు చెప్పారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాఉ నాయుడు.