ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ
దావోస్ – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ లో కూడిన బృందం దావోస్ పర్యటన ముగిసింది. బాబు నేరుగా ఢిల్లీకి రానున్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులతో పాటు ప్రముఖులతో భేటీ అవుతారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనుండడంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేటాయింపుల గురించి పీఎం మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ములాఖత్ కానున్నారు సీఎం.
అంతే కాకుండా మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వివరిస్తారు.
ఆ తర్వాత ఒకవేళ సమయం ఇస్తే పునరుత్పాధక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కూడా కలిసే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా తండ్రీ కొడుకులు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకు రావడంలో సక్సెస్ అయ్యారు. మరో వైపు ముగ్గురు సీఎంలు ఒకే చోట కొలువు తీరడం విశేషం.
దావోస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సీఎంలు ఫడ్నవీస్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు.