స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – మంత్రుల పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. 5 రోజుల్లో ఫైల్స్ క్లియర్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ర్యాంకులు ఇచ్చారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సిస్టమ్ లేదన్నారు. మన స్థానాన్ని బట్టే హోదా దక్కుతుందన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ ను క్లియర్ చేస్తే సమస్యలంటూ ఉండవని స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తుంటారని, ఆ విషయం గమనించి పనిపై ఫోకస్ పెట్టాలన్నారు.
సచివాలయంలో సమీక్ష చేపటటారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనల్ని నమ్మి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ర్యాంకులు రాలేదని బాధ పడాల్సిన అవసరం లేదన్నారు.
మెరుగైన ర్యాంక్ వచ్చేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు. దీని వల్ల మనం ఎక్కడ, ఏ స్థాయిలో ఉన్నామో తెలుస్తుందన్నారు. మన పనితీరు మెరుగు పడక పోతే ఇబ్బందులు ఏర్పడుతాయని అన్నారు.