ఏపీ ప్రజలకు జగన్ క్షమాపణ చెప్పాలి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ – ప్రకాశం బ్యారేజీ ఘటన వెనుక జగన్ హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై.
బోట్ల ఘటన వెనుక వైసీపీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక జగన్ ఉన్నారని, ఇందుకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఘటన గురించి మీకు తెలియక పోయినా తప్పు తప్పే అని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయం పేరుతో నేరగాళ్లు ఎంటర్ అయ్యారని, వారిని గుర్తించి ఏకి పారేస్తామని హెచ్చరించారు ఏపీ సీఎం.
ఎక్కడికి వెళ్లినా వెంటపడి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు. విచిత్రం ఏమిటంటే వైసీపీ వాళ్లు సమర్థించు కోవడం దారుణమన్నారు. ఇదిలా ఉండగా ఏపీ సీఎం చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించి చోటు చేసుకున్న బోట్ల ఘటనపై కావాలని టీడీపీ రాద్దాంతం చేస్తోందంటూ మండిపడ్డారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.