NEWSANDHRA PRADESH

నిరాడంబరుడు రెడ్డి సత్యనారాయణ – సీఎం

Share it with your family & friends

ఆయ‌న మృతి బాధాక‌రమ‌న్న చంద్ర‌బాబు

అమరావతి – ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత రెడ్డి సత్యనారాయణ మృతి చెంద‌డం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన సత్యనారాయణ నిరాడంబరత్వానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశార‌ని అన్నారు. నియోజకవర్గ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సత్యనారాయణ మృతి తీవ్ర విచారం కలిగించిందన్నారు. మంత్రిగా పని చేసి పదవులకు వన్నె తెచ్చారన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సంద‌ర్బంగా మాజీ మంత్రి మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు. పార్టీ అభివృద్ధికి ఆయన అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. వారి మరణం పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఆయ‌న వ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

మాడుగుల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు రెడ్డి స‌త్య‌నారాయ‌ణ‌. 1984లో టీడీపీలో చేరి పశుసంవర్ధక శాఖ, మత్స్యశాఖ మంత్రిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా సేవలు అందించారు. వరుసగా ఐదు సార్లు శాసన సభ్యునిగా గెలిచిన సత్యనారాయణ గారు ఎలాంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబర జీవితాన్ని గడిపారు.