విశాఖలో గూగుల్ పెట్టుబడి
వెల్లడించిన ఏపీ సీఎం బాబు
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రపంచ టెక్ దిగ్గజ కంపనీ గూగుల్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఈ మేరకు విశాఖలో ఇన్వెస్ట్ చేయబోతోందని పేర్కొన్నారు. టెక్నాలజీలో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, ప్రభుత్వం ఏఐని ఉపయోగించు కుంటోందని స్పష్టం చేశారు.
సంక్షోభాలనే అవకాశాలుగా మలచుకోవాలని సూచించారు చంద్రబాబు నాయుడు. ఓటు కీలకమైనదని, అదే ఇప్పటి వరకు దేశాన్ని కాపాడుతూ వస్తోందన్నారు. ప్రజాస్వామ్యం అన్నది ముఖ్యమని పేర్కొన్నారు. అది గనుక లేక పోతే నియంతృత్వం ఏర్పడుతుందన్నారు. ఎవరికీ స్వేచ్ఛ అన్నది లేకుండా పోతుందన్నారు.
తన హయాంలో దిగ్గజ గూగుల్ కంపెనీ విశాఖలో పెట్టుబడులకు ముందుకు వచ్చిందని , తనకు ఆనందంగా ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు. విశాఖ ఏఐకి ఒక సెంటర్‌గా మారబోతోందని స్పష్టం చేశారు. ఏఐతో భవిష్యత్తులో ఎన్నో మార్పులు వస్తాయని అన్నారు సీఎం.