చంద్రబాబు కండీషన్స్ అప్లై
స్పీకర్ తో పాటు 6 పదవులు
న్యూఢిల్లీ – రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఇందుకు తాజా ఉదాహరణ చంద్రబాబు, బీజేపీతో ఒప్పందం. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అద్భుతైమన ఫలితాలు వచ్చాయి ఏపీలో. ఇది ఊహించ లేదు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా.
ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో జగన్ రెడ్డి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. చివరకు ఆయన ప్రతిపక్ష హోదాను కూడా పొందలేక పోయారు. ప్రజలు ఛీ కొట్టారు..చీదరించుకున్నారు.
ఈ తరుణంలో ఎవరూ ఊహించని రీతిలో దేశంలో బీజేపీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. ఎన్డీయే పేరుతో మోడీ ప్రధాని అవుతారా లేదా అన్నది కీలకంగా మారింది. అటు బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య భూమిక పోషించనున్నారు.
దీంతో ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది. ఈ సమయంలో ఆయన కొన్ని కండీషన్స్ పెట్టినట్లు టాక్. స్పీకర్ తో పాటు ఆరు కేబినెట్ మంత్రులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.