NEWSANDHRA PRADESH

న‌యాబ్ సైనీ ప్ర‌మాణ స్వీకారంలో బాబు

Share it with your family & friends

ఏపీ సీఎం సెంట‌ర్ ఆఫ్ర అట్రాక్ష‌న్

హ‌ర్యానా – హ‌ర్యానాలో గురువారం జ‌రిగిన భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా పాల్గొన్నారు.

చంద్ర‌బాబు నాయుడుతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో పాటు మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, కేంద్ర ఉప‌రిత‌ల ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ కూడా పాల్గొన్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ హ‌ర్యానా రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా న‌యాబ్ సైనీ ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ముచ్చ‌ట‌గా మూడోసారి బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఇది రాష్ట్ర చ‌రిత్ర‌లో ఓ రికార్డ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ తాను ఈ వేడుక‌ల్లో పాల్గొనేందుకు, అభినందించేందుకు వ‌చ్చాన‌ని చెప్పారు. ప్ర‌ధాని మోడీ పేరు భార‌త దేశం అంత‌టా మ్యాజిక్ లాగా ప‌ని చేస్తోంద‌ని జేడీయూ నేత‌లు చెప్పారు.