రియల్ ఎస్టేట్ పై బాబు ఎఫెక్ట్ లేదు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రభావం తెలంగాణ రియల్ ఎస్టేట్ పై పడిందంటూ వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు. సీఎంకు అంత సీన్ లేదన్నారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్, బెంగళూరుకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. దీనిని నమ్మవద్దని కోరారు.
చంద్రబాబు నాయుడు ప్రభావితం ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రజలు ఆయనను స్వీకరించే స్థితిలో లేరన్నారు . మరో వైపు రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న దాడుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడిగా పేరు తెచ్చుకుంటున్నారని, తాజాగా రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షల్లో ఏపీకి చెందిన ప్రశ్నలు ఇవ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం అవుతోంది. కొత్తగా చైర్మన్ గా కొలువు తీరిన బుర్రా వెంకటేశం ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.