సీఎం విన్నపం మోడీ ఆమోదం
ముగిసిన చంద్రబాబు పీఎంతో భేటీ
ఢిల్లీ – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఫలప్రదమైంది. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కీలక అంశాల గురించి ప్రస్తావించారు. అంతే కాకుండా ఏపీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఏకరువు పెట్టారు. ప్రస్తుతం వరదల కరాణంగా ఏపీ అతలాకుతలమైందని వాపోయారు. ఖజానా ఖాళీగా ఉందని, జీతాలు చెల్లించేందుకు డబ్బులు కూడా లేవని పేర్కొన్నారు.
మరో వైపు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధులు మంజూరు చేయాలని మోడీకి విన్నవించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. పీఎంకు ధన్యవాదాలు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి సంబంధించిన విషయాలలో కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మద్దతు ఇవ్వాల్సిందిగా విన్నవించారు. దీనికి పీఎం సానుకూలంగా స్పందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు.