నివాళులు అర్పించిన లోకేష్
అమరావతి – మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్దంతి ఇవాళ. ఈ సందర్బంగా ఘనంగా నివాళులు అర్పించారు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్. పేద ప్రజల పక్షాన నిలిచి, నిరంతరం వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన ప్రజా నాయకుడు పరిరాట రవీంద్ర అని కొనియాడారు. సాహసమే ఊపిరిగా ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ మరువలేమన్నారు. అరాచక శక్తులతో పోరాడి ప్రజల గుండెల్లో అస్తమించని రవిగా కొలువుదీరిన పరిటాల ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా పరిటాల రవీంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పీడిత ప్రజల పక్షాన గొంతుకగా ఉన్నారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఆగస్టు 30, 1958లో పుట్టారు. భార్య పరిటాల సునీత. తను ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. 46 ఏళ్ల వయసులోనే దారుణ హత్యకు గురయ్యారు. కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు పరిటాల రవీంద్ర. జనవరి 24, 2005లో పార్టీ ఆఫీసు ఆవరణలో కాల్చబడ్డారు. పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నాడు. రాయలసీమను ఒంటి చేత్తో శాసించాడు.
తన తండ్రి పరిటాల శ్రీరాములు జీవితం ఆధారంగా ఎన్ . శంకర్ దర్శకత్వంలో శ్రీరాములయ్య తీశాడు. రవి జీవితం నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పేరుతో రెండు సినిమాలు తీశాడు. 1975లో భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు కుట్ర పన్ని తండ్రి శ్రీరాములు, సోదరుడు పరిటాల సుబ్బయ్యను హతమార్చారు. ఇదే అతడిని రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. తమ్ముడు హరి బూటకపు ఎన్ కౌంటర్ లో మరణించాడు. తనను వెంటాడడం ప్రారంభించడంతో రవి విప్లవ శిబిరం వైపు మళ్లాడు. ఎన్నో కేసులు నమోదయ్యాయి.