DEVOTIONAL

2025 టీటీడీ డైరీలు..క్యాలెండ‌ర్లు రిలీజ్

Share it with your family & friends

ఆవిష్క‌రించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు

తిరుమ‌ల – శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. మొద‌టి రోజైన శుక్ర‌వారం రాత్రి స్వామి వారి దర్శనానంతరం ఆలయంలోని రంగ నాయ‌కుల మండ‌పంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్ర‌బాబు నాయుడు టీటీడీ ముద్రించిన 2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు.

12 పేజీల క్యాలెండర్లు 13.50 లక్షలు, పెద్ద డైరీలు 8.25 లక్షలు, చిన్న డైరీలు 1.50 లక్షలు, టేబుల్‌ టాప్‌ క్యాలెండర్లు 1.25 ల‌క్ష‌లు, శ్రీవారి పెద్ద క్యాలెండర్లు 3.5 లక్షలు, శ్రీ పద్మావతి అమ్మ వారి పెద్ద క్యాలెండర్లు 10 వేలు, శ్రీవారు- శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్లు 3 లక్షలు, 6 షిట్ క్యాలెండ‌ర్లు 50 వేలు, టీటీడీ స్థానిక ఆల‌యాలు 10 వేలు, తెలుగు పంచాంగం క్యాలెండర్లు 2.50 లక్షల కాపీలను టీటీడీ ముద్రించింది.

రాష్ట్ర దేవదాయ శాఖ అమాత్యులు ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ ఈవో జయ శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు.

కాగా 2025 టీటీడీ డైరీలు, క్యాలెండర్లు అక్టోబరు 5వ తేదీ నుండి తిరుమల, తిరుపతిలో అందుబాటులో ఉంటాయి. అక్టోబరు రెండో వారం నుండి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయని వెల్ల‌డించారు ఈవో జె. శ్యామ‌ల రావు.