NEWSANDHRA PRADESH

97 ల‌క్ష‌ల భోజ‌నం.94 ల‌క్ష‌ల నీళ్ల బాటిళ్లు పంపిణీ

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆదివారం విజ‌య‌వాడ‌లోని ప‌లు ప్రాంతాల‌లో వ‌ర‌ద ప్ర‌భావానికి గురైన బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

అనంత‌రం మీడియాతో మాట్లాడారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. వాళ్ల‌కు విమ‌ర్శించ‌డం త‌ప్ప సాయం చేయ‌డం తెలియ‌ద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాలైన విజ‌య‌వాడ‌లో సహాయ కార్యక్రమాల కింద 97 లక్షల భోజనం ప్యాకెట్లు బాధితులకు అందించామ‌ని చెప్పారు.

94 లక్షల వాటర్ బాటిల్స్ సప్లై చేశామ‌ని అన్నారు చంద్ర‌బాబు నాయుడు. పాలు 28 లక్షల లీటర్లు ఇచ్చామ‌న్నారు సీఎం.

బిస్కెట్లు 41 లక్షల ప్యాకెట్లు ఇచ్చామ‌ని తెలిపారు. క్యాండిల్స్ 3 లక్షలు, అగ్గిపెట్టెలు 1.90 లక్షలు అంద‌జేసిన‌ట్లు వెల్ల‌డించారు. 163 మెట్రిక్ టన్నుల కూరగాయలు అందించ‌డం జ‌రిగింద‌న్నారు.

2090 ట్రిప్పుల నీరు వాటర్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేసామ‌న్నారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా 27 వేల ఇళ్లు శుభ్రం చేశామ‌ని తెలిపారు సీఎం చంద్ర‌బాబు నాయుడు. అలాగే నిత్యావసర వస్తువులు ఇప్పటి వరకు 1.10 లక్షల కుటుంబాలకు అందచేశామ‌న్నారు.