Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHప్ర‌గ‌తి ప‌థంలో ఏపీ ప‌య‌నం

ప్ర‌గ‌తి ప‌థంలో ఏపీ ప‌య‌నం

నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి – ప్ర‌జా ప్ర‌భుత్వ పాల‌న ఏర్ప‌డి ఆరు నెల‌లు గ‌డిచింద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు కృషి చేస్తున్నామ‌ని అన్నారు. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దామ‌ని పేర్కొన్నారు. వెంటిలేట‌ర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజ‌న్ ఇచ్చి నిల‌బెట్టామ‌ని చెప్పారు.

అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆమోద యోగ్యంగా ఉండేలా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనకు జ‌నం 100 మార్కులు వేశార‌ని అన్నారు.

నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు సీఎం.

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టామ‌ని అన్నారు. ‘రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్’ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పని చేస్తున్నామ‌ని చెప్పారు.

చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి…ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామ‌ని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. . మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో…స్వర్ణాంధ్ర – 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా నిలబెడతామ‌ని ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments