టీడీపీ రాకతోనే సంక్షేమ పథకాలు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రారంభం అయ్యాయని అన్నారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బుధవారం శాసన సభలో ప్రసంగించారు.
రూ. 2లకే కిలో బియ్యం ప్రారంభించిన ఘనత టీడీపీకి, మాజీ దివంగత సీఎం నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు సీఎం. దేశంలోనే ఆదర్శ ప్రాయంగా తమ పాలన సాగిందన్నారు. టీడీపీ ఎన్నో సామాజిక కార్యక్రమాలను రూపొందించిందని, విజయవంతంగా అమలు చేసిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
కోట్లాది మందికి టీడీపీ రాకతో ప్రయోజనం చేకూరిందని, క్రమశిక్షణ, నిబద్దత, అంకితభావం, కార్యకర్తల అకుంఠిత దీక్ష కలిపి బలంగా తయారైందని చెప్పారు సీఎం. ఇవాళ దేశంలోని పలు పార్టీలు తెలుగుదేశం పార్టీని ఆదర్శ ప్రాయంగా తీసుకున్నాయని స్పష్టం చేశారు.
టీడీపీకి కార్యకర్తల, నేతల బలగం ఉందని, ఏ పార్టీకి లేరని అన్నారు. వారి సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. రూ. 5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించడం జరిగిందన్నారు.