NEWSANDHRA PRADESH

ఏపీకి ల‌క్ష కోట్లు ఇవ్వండి

Share it with your family & friends

ప్ర‌ధానిని కోరిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి – కేంద్ర స‌ర్కార్ లో కింగ్ మేక‌ర్ గా మారిన ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న మాట నెగ్గించుకునే ప్ర‌య‌త్నంలో స‌క్సెస్ అయ్యారు. ఇప్ప‌టికే త‌మ రాష్ట్రానికి రావాల్సిన బ‌కాయిలు వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

ఢిల్లీ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో కీల‌క అంశాల గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని క‌లుసుకున్నారు. ఏపీ కోసం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాల‌ని కోరారు. ఈ మేర‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఊహించ‌ని రీతిలో భారీ ఎత్తున ఆర్థిక సాయం కావాల‌ని కోరారు. ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీగా 12 బిలియన్ డాలర్లు కావాలని మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు కోరారు.

అంటే దాదాపు 1 లక్ష కోట్లకు మోడీ సూత్రప్రాయంగా అంగీకరించారు . ఈ ఏడాది జాతీయ బడ్జెట్‌లో ఎక్కువ భాగం ప్రకటించే అవకాశం ఉందని స‌మాచారం.

రాష్ట్ర ఆదాయానికి మించిన జీతాలు, పింఛన్లు , అప్పులతో ఆంధ్ర తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వ రుణం ప్రస్తుతం దాని జీడీపీలో 33 శాతంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

రాష్ట్ర రుణ భారంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు , ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించ‌నుంది.