ఏపీలో పరిశ్రమలు ఏవీ..?
నిలదీసిన చంద్రబాబు నాయుడు
అమరావతి – ఏపీలో జగన్ కొలువు తీరాక పరిశ్రమల ఊసే లేదని మండిపడ్డారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటకు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. కేవలం కమీషన్ల కోసం కక్కుర్తి పడి వారిని వేధించడం వల్లనే ఇలా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ చీఫ్. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాను పవర్ లో ఉన్న సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు కీలకమైన నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.
చాలా మంది ఇండస్ట్రియలిస్టులు, బడా బాబులు, పెట్టుబడిదారులు ఏపీకి రావాలంటే జంకుతున్నారని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక ముందుకు రావడం లేదని ఆవేదన చెందారు నారా చంద్రబాబు నాయుడు.
జగన్ కు రోజులు దగ్గర పడ్డాయని, ఇక రాబోయేది టీడీపీ సంకీర్ణ సర్కారేనని జోష్యం చెప్పారు. తాము వచ్చాక ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ ను చేస్తానని హామీ ఇచ్చారు .