NEWSANDHRA PRADESH

ఆ శిథిలాలు విధ్వంసానికి ఆన‌వాళ్లు

Share it with your family & friends

విధ్వంస పాలనకు ప్రతీక ప్రజావేదిక

అమ‌రావ‌తి – టీడీపీ చీఫ్ , ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎంగా కొలువు తీరిన అనంత‌రం తొలిసారిగా టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి చేరుకున్నారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులు.

ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ప‌లు అంశాల‌పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. త‌న‌తో పాటు డిప్యూటీ సీఎం, ఇత‌ర మంత్రులు , ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రైనా స‌రే ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తామ‌న్నారు.

సెక్యూరిటీ నిబంధనలు పాటిస్తూనే సాధ్యమైనంతగా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజల నుంచి తానే నేరుగా వినతులు తీసుకునేందుకు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలు ప్రభుత్వ పెద్దలతో చెప్పుకునే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు అన్నారు.

దీని కోసం ఏ పద్ధతి అనుసరించాలి..ఎలా చేయాలి అనే విషయాన్ని చర్చిస్తున్నామని సిఎం అన్నారు. సచివాలయంలోనే వినతులు స్వీకరణ కార్యక్రమం పెట్టవచ్చా…లేక ప్రజా వినతులు స్వీకరణకు మరేదైనా వేదికను ఏర్పాటు చేయాల్సి ఉంటుందా అనేది ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధ్వంస పాలనకు ప్రతీకగా దాన్ని అలాగే ఉంచుతామని, ఆ శిథిలాలను తొలగించమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర సచివాలయంలో, రాజధాని ప్రాంతంలో యాక్టివిటీ బాగా పెరుగుతుందని…..సచివాలయానికి రాకపోకలు కోసం రోడ్లు, రవాణా, ఇతరత్రా సౌకర్యాలు పెంచుతామని అన్నారు.