పాలనను గాడిలో పెడతా – సీఎం
ఉన్నతాధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు పెంచారు. తన స్టైల్ లో దిశా నిర్దేశం చేయడం మొదలు పెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రులతో సమీక్ష చేపట్టారు. అనంతరం హుటా హుటిన తిరుమలకు బయలు దేరి వెళ్లారు. అక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
తిరుగు ప్రయాణమై బెజవాడకు వచ్చారు. ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం నేరుగా సచివాలయానికి విచ్చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీ పై చేశారు. అనంతరం మరో నాలుగు కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టారు.
ఈ సందర్బంగా ఐఏఎస్ లు, ఐపీఎఎస్ లతో సమీక్ష చేపట్టారు. గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ లో దారుణంగా ప్రవర్తించారంటూ ఆవేదన చెందారు. ఈసారి ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. అజయ్ జైన్ , ఆంజనేయులు, శ్రీలక్ష్మికి నారా చంద్రబాబు నాయుడు కలిసేందుకు ఒప్పుకోలేదు. దీంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు.
జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని, దానిని గాడిలో పెడతానంటూ ప్రకటించారు. ఇక నుంచి తాను అన్నీ చూసుకుంటానని చెప్పారు.