కుండపోత చెన్నై ఎయిర్‌పోర్ట్ మూసివేత
నీట మునిగిన 134 లోతట్టు ప్రాంతాలు
తమిళనాడు – ఫెయింజాల్ తుపాను తీవ్రత కొనసాగుతోంది. ఎక్కడ చూసినా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురవడంతో తమిళనాడు రాష్ట్రం అతలా కుతలంగా మారింది. భారీ ఎత్తున వర్షాలు పడడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరిస్థితిని అంచనా వేస్తున్నారు . ఇదిలా ఉండగా తుపాను కారణంగా విమానాల రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెన్నై అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ను మూసి వేస్తున్నట్లు ప్రకటించారు. 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఎయిర్ పోర్ట్ లోనే వందలాది మంది ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. రేపు ఉదయం వరకు మూసి వేశారు.
ఎవరూ ఆందోళన చెందవద్దని, సహాయక చర్యలు చేపట్టామని ప్రకటించారు సీఎం ఎంకే స్టాలిన్. ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీంలు సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. మొత్తంగా పరిస్థితి కంట్రోల్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది.