మహేంద్ర సింగ్ ధోనీ టీం ఇదే
కీలక ఆటగాళ్లపై సీఎస్కే ఫోకస్
చెన్నై – వేలం పాట ముగిసింది. ఎప్పటి లాగే చెన్నై సూపర్ కింగ్స్ కీలక ఆటగాళ్లను తీసుకుంది. తొలి రోజు ఏడుగురు ఆటగాళ్లను కొనుగోలు చేస్తే రెండో రోజు వేలం పాటలో ప్రధాన ప్లేయర్లను తీసుకున్నది. భారీ ధరకు రవిచంద్రన్ అశ్విన్ , నూర్ అహ్మద్ లను చేజిక్కించుకుంది. పేసర్ అన్సుల్ కాంబోజ్ ను రూ. 3.40 కోట్లు పెట్టింది. సామ్ సురాన్ , విజయ్ శంకర్ , దీపక్ హుడాలు సీఎస్కే పరం అయ్యారు.
రుతురాజ్ గైక్వాడ్ ను రూ. 18 కోట్లు, మతీష పతిరణ రూ. 13 కోట్లు, శివమ్ దూబే రూ. 12 కోట్లు, రవీంద్ర జడేజా రూ. 18కోట్లు, ఎంఎస్ ధోనీ రూ. 18 కోట్లు పెట్టి తీసుకుంది. తాజాగా జరిగిన వేలం పాటలో భారీగానే ఖర్చు చేసింది.
రూ. 6.25 కోట్లకు డెవాన్ కాన్వేను, రూ. 3.4 కోట్లకు రాహుల్ త్రిపాఠిని, రూ. 4 కోట్లకు రచిన్ రవీంద్రను, రూ. 9.75 కోట్లకు అశ్విన్ ను, రూ. 4.80 కోట్లకు ఖలీల్ అహ్మద్ ను, రూ. 10 కోట్లకు నూర్ అహ్మద్ ను, రూ. 1.2 కోట్లకు విజయ్ శంకర్ ను, రూ. 2.4 కోట్లకు సామ్ కరన్ ను , రూ. 30 లక్షలకు షేక్ రషీద్ ను, రూ. 3.4 కోట్లకు కాంబోజ్ ను, రూ. 30 లక్షలకు చౌదరిని తీసుకుంది.
రూ. 1.7 కోట్లకు దీపక్ హూడాను, రూ. 2.2 కోట్లకు గుర్ణప్నీత్ సింగ్ ను , రూ. 2 కోట్లకు నాథన్ ఎల్లిస్ ను , రూ. 1.5 కోట్లకు జామీ ఓవర్టన్ ను , రూ. 30 లక్షలకు కమలేష్ నాగర్ కోటిని, రూ. 30 లక్షలకు రామకృష్ణ ఘోష్ ను, శ్రేయాస్ గోపాల్ రూ. 30 లక్షలకు, వెంకటేశ్ బేడీని రూ. 55 లక్షలకు, ఆండ్రీ సిద్దార్త్ ను రూ. 30 లక్షలకు తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్.